: అట్టహాసంగా ప్రారంభమైన గోల్కొండ బోనాలు
హైదరాబాదులో బోనాల ఉత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. గోల్కొండలో కొలువైన జగదాంబికా మహంకాళి ఆలయంలో బోనాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వం తరపున మంత్రులు నాయిని, పద్మారావులు హాజరై, అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. తెలంగాణ సాంప్రదాయాలు ఉట్టిపడేలా ఈ కార్యక్రమం కొనసాగింది. ఈ క్రమంలో, లంగర్ హౌస్ నుంచి తొట్టెల ఊరేగింపు సాగింది. ఈ సందర్భంగా శివసత్తుల పూనకాలు, కళాకారుల ఆటపాటలు, పోతురాజుల విన్యాసాలతో ఊరేగింపు కన్నుల పండువగా కొనసాగింది.