: 69 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన భారత్


జింబాబ్వేతో జరుగుతున్న రెండో టీ20లో భారత్ ఎదురీదుతున్నట్టే కనిపిస్తోంది. 146 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన టీమిండియా టాప్ ఆర్డర్ కుప్పకూలింది. కేవలం 69 పరుగులకే 5 వికెట్లను భారత్ కోల్పోయింది. వన్ డౌన్ లో వచ్చిన రాబిన్ ఊతప్ప విరుచుకుపడటంతో భారత్ ఈ మాత్రం స్కోర్ అయినా చేయగలిగింది. 25 బంతులను ఎదుర్కొన్న ఊతప్ప 9 ఫోర్లతో 42 పరుగులు చేసి విలియమ్స్ బౌలింగ్ లో రిటర్న్ క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. ఓపెనర్లు రహానే 4 పరుగుల వద్ద రనౌట్ కాగా, మురళీ విజయ్ 13 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద క్రెమర్ బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు. క్రెమర్ బౌలింగ్ లోనే పాండే డకౌట్ కాగా, ఐదు పరుగులు చేసిన జాదవ్ రనౌట్ అయ్యాడు. ప్రస్తుతం భారత్ స్కోరు 11 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 78 పరుగులు. స్టువర్ట్ బిన్నీ (9), తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్న సంజు శాంసన్ (5) పరుగులతో క్రీజులో ఉన్నారు.

  • Loading...

More Telugu News