: కోదండరామ్, అల్లం నారాయణ ఏమంటారో!
తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే పదవిని వదలకుండానే, వేతనాలు తీసుకుంటూ, టీఆర్ఎస్ తొత్తుగా మారి ఆ పార్టీలో పదవులు అనుభవిస్తున్న తలసాని శ్రీనివాస్ యాదవ్ విషయంలో జేఏసీ నేతలు కోదండరామ్, అల్లం నారాయణలు తక్షణం స్పందించాలని తెలంగాణ విపక్ష నేతలు డిమాండ్ చేశారు. జేఏసీ నేతలంటే తమకు గౌరవం ఉందని, వారు పూర్తిగా టీఆర్ఎస్ కు కీలుబొమ్మలుగా మిగలకుండా, ఈ విషయంలో తమ అభిప్రాయాలను తెలియజేయాలని అటు తెలుగుదేశం పార్టీ నేత రేవంత్ రెడ్డి, ఇటు కాంగ్రెస్ పార్టీ నేత షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు. ప్రజలకు వారిపై ఉన్న సదభిప్రాయం కొనసాగాలంటే, తలసాని విషయంలో కేసీఆర్ కు బుద్ధి చెప్పాలని, అందుకు తమతో పాటు కలసిరావాలని కోరారు.