: ఐఎస్ఐఎస్ నెట్ వర్క్ ను బద్దలు కొట్టిన సౌదీ అరేబియా, 431 మంది అరెస్ట్
ప్రపంచానికి పెను విఘాతంగా మారిన ఇస్లామిక్ ఉగ్రవాదుల ఐఎస్ఐఎస్ నెట్ వర్క్ ను బద్దలు కొట్టే విషయంలో సౌదీ అరేబియా కీలక విజయం సాధించింది. ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులుగా ఉన్న 431 మంది సౌదీ అరేబియన్లను అరెస్ట్ చేశామని ఆ దేశ అంతర్గత వ్యవహారాల శాఖ వెల్లడించింది. గత కొద్ది వారాలుగా జరిపిన దాడుల్లో భాగంగా ఐఎస్ఐఎస్ మూలాలున్న వారందరినీ అదుపులోకి తీసుకున్నామని, వీరందరికీ ఏదో ఒక రూపంలో ఉగ్రవాద సంస్థతో సంబంధాలున్నాయని తెలిపింది. వీరిలో కొందరు ఎన్నో దాడులకు కుట్రలు పన్నారని, ఇటీవలి సౌదీ మసీదుపై దాడిలో ప్రమేయమున్నవారినీ పట్టుకున్నామని వివరించింది.