: షోలాపూర్ కేంద్రంగా టీటీడీ సేవా టికెట్ల సర్వర్ హ్యాక్


శ్రీవెంకటేశ్వరునికి జరిగే వివిధ సేవలకు సంబంధించిన టికెట్లను ఆన్ లైన్లో జారీ చేసే సర్వరును కొందరు ఉద్యోగుల ప్రమేయంతో షోలాపూర్ కు చెందిన ఓ వ్యక్తి హ్యాక్ చేసినట్టు నిఘా అధికారులు గుర్తించారు. గత కొంత కాలంగా, అధిక డిమాండ్ ఉన్న అర్చన, తోమాల, అష్టదళ పాదపద్మారాధన, సుప్రభాతం తదితర సేవా టికెట్లు ఉదయం వెబ్‌ సైట్‌ ఓపెన్‌ చేయగానే క్షణాల్లో అయిపోతున్నాయి. దీనిపై పలు ప్రాంతాల నుంచి ఫిర్యాదులు వస్తుండగా, అధికారులు విచారణ చేపట్టారు. ఆన్‌ లైన్‌ లో సేవా టికెట్లు పొందినవారంతా మహారాష్ట్రలోని షోలాపూర్‌ ప్రాంతానికి చెందిన వారేనని తెలుసుకుని విస్తుపోయారు. ఈ టికెట్లతో వచ్చిన భక్తులను విచారిస్తే, షోలాపూర్‌ కు చెందిన ఓ వ్యక్తి టీటీడీ సర్వర్‌ ను హ్యాక్‌ చేసి సాక్ష్యాలు దొరక్కుండా జాగ్రత్త పడుతూ, ఏకమొత్తంగా టికెట్లు కాజేస్తున్నట్టు గుర్తించారు. వాటిని అధిక ధరకు అమ్ముతున్నట్లు తెలుసుకొన్నారు. సర్వర్ హ్యాక్ వెనుక తిరుమలలోని కొందరు ఉద్యోగుల సహకారం ఉండవచ్చన్న అనుమానాలతో ఆ దిశగా విచారణ వేగవంతం చేశారు.

  • Loading...

More Telugu News