: శ్రీమంతుడు టైటిల్ కి చిన్నోడే కరెక్టు!: వెంకటేష్
'శ్రీమంతుడు' టైటిల్ కి చిన్నోడే కరెక్ట్ అని ప్రముఖ నటుడు విక్టరీ వెంకటేష్ తెలిపారు. హైదరాబాదులోని శిల్పకళావేదికలో జరిగిన 'శ్రీమంతుడు' ఆడియో వేడుకలో పాల్గొన్న సందర్భంగా వెంకీ మాట్లాడుతూ, 'శ్రీమంతుడు' సినిమా ట్రైలర్ చూసిన తరువాత తాను కూడా రెండు సైకిళ్లు కొన్నానని చెప్పారు. కష్టపడి ప్రాక్టీస్ చేసి సైకిల్ తొక్కాను కానీ రఫ్ గా కనిపించానని, కానీ, చిన్నోడు మాత్రం స్మూత్ గా, ఆకట్టుకునేలా ఉన్నాడని కితాబిచ్చారు. 'వాడలా కనిపించడం వెనుక కిటుకు ఏదో మీక్కూడా తెలుస'ని వెంకటేష్ అనడంతో అభిమానులు కేరింతలు కొట్టారు. చిన్నోడు 'శ్రీమంతుడు'గా వచ్చాక దిమ్మతిరిగిపోతుందని, సినిమా రికార్డులన్నీ తన ఖాతాలో వేసుకుంటాడని వెంకటేష్ ధీమాగా చెప్పారు. వేడుకకు ముఖ్య అతిథిగా వచ్చిన వెంకటేష్ ఆడియో సీడీని ఆవిష్కరించి, తొలి సీడీని ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు అందజేశారు.