: సూపర్ స్టార్ కృష్ణకు సన్మానం


సీనియర్ నటుడు సూపర్ స్టార్ కృష్ణకు 'శ్రీమంతుడు' సినిమా యూనిట్ సన్మానం చేసింది. సినీ రంగ ప్రవేశం చేసి 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సూపర్ స్టార్ కృష్ణ, విజయనిర్మల దంపతులకు సన్మానం చేశారు. నమ్రత శిరోద్కర్ విజయనిర్మలను సత్కరించగా, ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు సూపర్ స్టార్ కృష్ణను దుశ్శాలువతో సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇంత కాలం తనను ఆదరించిన తెలుగు సినీ పరిశ్రమకు, అభిమానులకు రుణపడి ఉంటానని అన్నారు.

  • Loading...

More Telugu News