: సినిమా బాగుంటుంది... సూపర్ డూపర్ హిట్టే: శ్రీను వైట్ల
దర్శకుడు కొరటాల శివ 'మిర్చి' సినిమాను మించి 'శ్రీమంతుడు' సినిమాను రూపొందించి ఉంటాడని దర్శకుడు శ్రీను వైట్ల తెలిపాడు. హైదరాబాదులోని శిల్పకళావేదికలో జరుగుతున్న ఆడియో వేడుకలో ఆయన మాట్లాడుతూ, 'శ్రీమంతుడు' సినిమా కోసం అభిమానుల కంటే ఆత్రుతతో ఎదురు చూస్తున్నానని, ట్రైలర్ చూస్తుంటే సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వడం ఖాయమని అన్నాడు. సినిమా నిర్మాతలు ఖర్చుకు వెనుకాడరు కనుక సినిమా చాలా రిచ్ గా వచ్చి ఉంటుందని, అలాగే మహేష్ బాబు అంటేనే 'సినిమా హిట్ ఫార్ములా' అని శ్రీను వైట్ల అభిప్రాయపడ్డాడు. పాటలు ఫుల్ ఎనర్జిటిక్ గా ఉన్నాయని, దేవీశ్రీప్రసాద్ అద్భుతమైన సంగీతాన్ని అందించాడని శ్రీను వైట్ల తెలిపాడు.