: సముద్ర గర్భంలో ఉన్న 18వ శతాబ్దం నాటి నౌక వెలుగుచూసింది


సాంకేతిక పరిజ్ఞానం ఎన్నో ఆవిష్కరణలకు తెరతీస్తోంది. ఆ క్రమంలో అమెరికాలోని ఉత్తర కరోలినా సముద్ర తీరంలో 18వ శతాబ్దంలో మునిగిపోయిన నౌకను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. సముద్రం అడుగున వినియోగించే వాహనాలు, సోనార్లు వాడి డ్యూక్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్త సిండీ వాన్ డోవర్ తన బృందంతో కలిసి ఈ నౌకను కనుగొన్నట్టు తెలిపారు. సముద్రంలో మునిగిన నౌక ఫోటోల ఆధారంగా ఈ నౌకను 18వ శతాబ్దానికి చెందినదిగా పురావస్తు శాఖ తెలిపింది. ఈ పరిశోధన సముద్రంలోని మరిన్ని రహస్యాలు వెలికి తీసేందుకు ఉపయోగపడుతుందని వాన్ డోవర్ అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News