: శ్రీమంతుడు ఆడియో వేడుకకు తరలి వస్తున్న అభిమానులు


హైదరాబాదులోని శిల్పకళా వేదికపై మరికాసేపట్లో ప్రారంభం కానున్న మహేష్ బాబు 'శ్రీమంతుడు' సినిమా ఆడియో వేడుకకు అభిమానులు తరలి వస్తున్నారు. సాయంత్రం ఏడు గంటలకు ఆడియో వేడుక ప్రారంభం కానుండగా, నాలుగు గంటల నుంచే శిల్పకళా వేదికకు అభిమానులు చేరుకుంటున్నారు. మహేష్ బాబు, శృతి హాసన్ నటించిన 'శ్రీమంతుడు' సినిమాను 'మిర్చి' ఫేం కొరటాల శివ రూపొందించారు. దీంతో ఈ సినిమాపై ఎన్నో అంచనాలున్నాయి. 'బాహుబలి' సినిమా విడుదల కారణంగా 'శ్రీమంతుడు' విడుదల ఆలస్యమైన సంగతి తెలిసిందే. తెలుగు సహా కోలీవుడ్, బాలీవుడ్, శాండల్ వుడ్ లలో మహేష్ సినిమా అంటే ఆసక్తి వ్యక్తం చేయని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఈ నేపథ్యంలో మహేష్ బాబు సినిమా ఆడియో వేడుకను ఘనంగా నిర్వహించేందుకు నిర్మాతలు ఏర్పాట్లు చేశారు.

  • Loading...

More Telugu News