: తప్పును కప్పిపుచ్చుకోవడానికే సీఎం ఎవరిపైనా చర్యలు తీసుకోలేదు: రోజా


ఏపీ సీఎం చంద్రబాబునాయుడుపై వైఎస్సార్సీపీ మహిళా నేత, నగరి ఎమ్మెల్యే రోజా ధ్వజమెత్తారు. రాజమండ్రి పుష్కరాల్లో చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటనలో తన తప్పును కప్పిపుచ్చుకునేందుకే చంద్రబాబు ఎవరిపైనా చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. వైఎస్ హయాంలో పుష్కరాల వేళ ఇద్దరు చనిపోతే చంద్రబాబు రాద్ధాంతం చేశారని, వైఎస్ రాజీనామాకు డిమాండ్ చేశారని, ఇప్పుడు 27 మంది చనిపోతే చంద్రబాబు ఇంకా ఎందుకు పదవిలో ఉన్నారని రోజా నిలదీశారు. పుష్కరాల్లో ఏర్పాట్లు సరిగా చేయలేదని, భక్తులను ఒక్కసారిగా వదలడంతోనే దారుణం జరిగిందని విమర్శించారు.

  • Loading...

More Telugu News