: కొవ్వూరులో మంత్రి సునీత పుష్కర స్నానం
ఏపీ మంత్రులు ఒక్కొక్కరుగా గోదావరి పుష్కర స్నానాల్లో పాల్గొంటున్నారు. మంత్రి పరిటాల సునీత ఈరోజు పుష్కర స్నానం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు పుష్కర ఘాట్ లో తన సోదరుడి కుటుంబంతో కలసి ఆమె స్నానమాచరించారు. అంతకుముందు ఘాట్లన్నీ పరిశీలించిన సునీత ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా పుష్కరాలు నిర్వహిస్తోందని మంత్రి అన్నారు.