: పరిణీతి చోప్రా నియామకం నాకు తెలియకుండానే జరిగింది: హర్యానా ఆరోగ్య శాఖ మంత్రి


ప్రధాని నరేంద్ర మోదీ తీసుకువచ్చిన ప్రతిష్ఠాత్మక పథకం 'బేటీ బచావో బేటీ పఢావో' పథకానికి హర్యానాలో బ్రాండ్ అంబాసడార్ గా బాలీవుడ్ నటి పరిణీతి చోప్రాను నియమించడం తెలిసిందే. అయితే, ఆమె నియామకం విషయం తనకు తెలియదని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి అనిల్ విజ్ అంటున్నారు. ఆ విషయమై తనకు ఎవరూ సమాచారం అందించలేదని అన్నారు. ముఖ్యమంత్రి మనోహర్ లాల్ కత్తర్ తీసుకున్న ఈ నిర్ణయం విజ్ వ్యాఖ్యలతో వివాదం రూపు దాల్చింది. "ఎవరో నటిని ప్రచారకర్తగా నియమించారని సోషల్ మీడియా ద్వారా తెలిసింది. ఈ పథకం గురించి రాష్ట్రంలో ప్రచారం చేయాల్సింది నా మంత్రిత్వ శాఖే. ఆరోగ్య శాఖలోని వైద్యులు ఈ పథకం గురించి విశేష ప్రచారం నిర్వహిస్తున్నారు. అలాంటప్పుడు ఓ నటుడితో లేక నటితో ప్రచారం చేయించాల్సిన అవసరం లేదనుకుంటున్నా" అని ట్వీట్ చేశారు. ఇటీవల సీఎం ఖత్తర్, మంత్రి విజ్ మధ్య విభేదాలు నెలకొన్నట్టు హర్యానా రాజకీయ వర్గాలంటున్నాయి.

  • Loading...

More Telugu News