: వెల్లివిరిసిన మతసామరస్యం...గర్మిళ్లలో ముస్లిం, మామిడికుదురులో క్రిస్టియన్ పుష్కర స్నానం
గోదావరి మహా పుష్కరాల్లో మత సామరస్యం వెల్లివిరుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో హిందువులు పుష్కర స్నానాల కోసం గోదావరి తీరానికి పోటెత్తుతున్నారు. ముస్లిం, క్రైస్తవులు కూడా హిందువులతో ఉన్న స్నేహసంబంధాలను గుర్తు చేసుకుంటూ వారూ పుష్కర స్నానాలు చేస్తున్నారు. నిన్న ఇటు తెలంగాణలోనే కాక అటు ఏపీలోనూ మత సామరస్యానికి నిలువెత్తు నిదర్శనంలా నిలిచే రెండు ఘటనలు చోటుచేసుకున్నాయి. ఆదిలాబాదు జిల్లా మంచిర్యాలకు చెందిన ముస్లిం సోదరుడు ఇంతియాజ్ భార్య, కొడుకుతో కలిసి గర్మిళ్లకు వచ్చి గోదావరిలో పుష్కర స్నానం చేశారు. ఇక తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు సమీపంలోని అప్పనపల్లిలో ఏర్పాటు చేసిన ఘాట్ కు బ్రెజిల్ కు చెందిన నీల్స్ పిటర్సన్ అనే క్రైస్తవ సోదరుడు వచ్చారు. ఆయన కూడా గోదావరి నీటిలో పుష్కర స్నానం చేశారు.