: భర్త కోసం శ్రీలంక చెక్కేసిన సానియా మీర్జా
ఇటీవలే వింబుల్డన్ టైటిల్ నెగ్గి ఊపుమీదున్న భారత టెన్నిస్ తార సానియా మీర్జా రంజాన్ పండుగను శ్రీలంకలో జరుపుకుంటోంది. భర్త షోయబ్ మాలిక్ తో రంజాన్ సెలబ్రేట్ చేసుకునేందుకు శుక్రవారం రాత్రి ఆమె శ్రీలంక వెళ్లింది. ప్రస్తుతం పాకిస్థాన్ జట్టు శ్రీలంకలో పర్యటిస్తోంది. జట్టులో షోయబ్ కూడా సభ్యుడు. దీంతో, సానియా భర్త కోసం హైదరాబాద్ వీడింది. దీనిపై సానియా మీడియాతో మాట్లాడుతూ... "షోయబ్ తో 'ఈద్' జరుపుకోవడం చాలా ప్రత్యేకం. కొంతకాలంగా టోర్నీలతో బిజీగా ఉండడంతో విరామమే దొరకడంలేదు. అదృష్టంకొద్దీ ఇప్పుడు కాస్త వీలు చిక్కింది" అని తెలిపింది. ఇక, రంజాన్ సందర్భంగా... హైదరాబాద్, తెలంగాణ వాసులకే కాదు యావత్ దేశ వాసులందరికీ మంచి జరగాలని ఆశిస్తున్నట్టు పేర్కొంది.