: అన్నీ మర్చిపోదాం... ఆనందంగా ఉందాం: ముస్లింలకు రాష్ట్రపతి శుభాకాంక్షలు
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రంజాన్ పర్వదినం సందర్భంగా ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ శుభసమయాన పరస్పరం క్షమించుకుని, విభేదాలన్నీ మర్చిపోయి హాయిగా ఉందామని పిలుపునిచ్చారు. "ఈద్-ఉల్-ఫితర్ పండుగ రోజున నా దేశ వాసులకు హార్ధిక శుభాకాంక్షలు... ముఖ్యంగా, ముస్లిం సోదర, సోదరీమణులందరికీ. ఈ పుణ్యదినం ప్రతి ఒక్కరిలోనూ మెండైన ఉదార స్వభావాన్ని, కరుణను పాదుకొల్పాలని ఆశిస్తున్నాను. సామరస్యం, సంఘీభావం, సోదరభావం పరంగా ఈ పండుగ అన్ని మతాల ప్రజలను ఏకం చేయాలి. ఈ మహోన్నత దేశంలోని సమ్మిళత సంస్కృతిలో మన ప్రతిష్ఠను బలంగా చాటాలి" అని ప్రణబ్ సందేశమిచ్చారు.