: ట్రాఫిక్ దిగ్బంధంలో ఏపీ రహదారులు... బారులు తీరిన పుష్కరయాత్రికుల వాహనాలు


రెండు రోజుల పాటు సెలవులు రావడంతో గోదావరి పుష్కరాలకు భారీ సంఖ్యలో జనం తరలి వెళుతున్నారు. దాంతో ఏపీలో రహదారులన్నీ జనమయమయ్యాయి. ఉభయగోదావరి జిల్లాలలో పుష్కరాలకు వెళ్లే వాహనాలతో చెన్నై-కోల్ కతా జాతీయ రహదారిపై ట్రాఫిక్ స్తంభించింది. విశాఖ జిల్లా నక్కపల్లి, కాగిత టోల్ గేట్ ప్రాంతాల్లో దాదాపు 2 కిలోమీటర్ల మేర కార్లు, బస్సులు ఇతర వాహనాలు నిలిచిపోయాయి. నక్కపల్లి అడ్డరోడ్డు వద్ద ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు పోలీసులు చర్యలు చేపడుతున్నారు. అటు విజయవాడ- రాజమండ్రి జాతీయ రహదారిపై కూడా వందలాది వాహనాలు నిలిచిపోయాయి. గన్నవరం, హనుమాన్ జంక్షన్ వద్ద ట్రాఫిక్ స్తంభించింది. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట వద్ద 6 కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఇటు పశ్చిమగోదావరి జిల్లాలోని కొవ్వూరు-నల్లజర్ల, కోవ్వూరు-నిడదవోలు మార్గాల్లో ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. ఇక విజయవాడ, విశాఖ రైల్వేస్టేషన్లు పుష్కరయాత్రికులతో నిండిపోయాయి. గంటలకొద్దీ రైళ్లు ఆలస్యంగా నడుస్తుండటంతో భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News