: హైదరాబాద్ శివార్లలో ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించాలని కేసీఆర్ ఆదేశం
పుష్కర స్నానాలకు వెళ్లే భక్తుల వాహనాలతో హైదరాబాద్ శివార్లలోని రహదారులు ట్రాఫిక్ తో నిండిపోవడంతో యుద్ధప్రాతిపదికన క్రమబద్ధీకరించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. టోల్ గేట్ల వద్ద వాహనాలను ఎక్కువసేపు ఆపకుండా త్వరగా పంపేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వాహనాలు వెళ్లేలా చూడాలని అధికారులకు సమీక్షలో సూచించారు. భక్తుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో పుష్కరఘాట్ల వద్ద పోలీసులు జాగ్రత్తలు తీసుకోవాలని, 24 గంటల పాటు గజ ఈతగాళ్లు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. నేడు, రేపు సెలవులు కావడంతో హైదరాబాద్ నుంచి పలు ప్రాంతాలకు గోదావరి పుష్కరాలకు భక్తులు తరలి వెళుతున్నారు. దాంతో ఉప్పల్ నుంచి వరంగల్, ఖమ్మం వెళ్లే రహదారులపై, జేబీఎస్ నుంచి నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ వెళ్లే రహదారులపై భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది.