: కాశ్మీర్ లో యుద్ధకాండ... పాక్, ఐఎస్ జెండాల ప్రదర్శన, గాల్లోకి పోలీసుల కాల్పులు
జమ్మూ కాశ్మీర్ లో పవిత్ర రంజాన్ రోజున అలజడి రేగింది. వేర్పాటువాద అల్లరి మూకలు పేట్రేగాయి. వేర్పాటువాద నేత గిలానీ పిలుపు మేరకు శ్రీనరగ్, అనంతనాగ్ లలో ర్యాలీ కోసం రోడ్లమీదకు వచ్చిన అల్లరిమూకలు పాకిస్థాన్ జెండాతో పాటు ఐఎస్ జెండాలను ప్రదర్శించాయి. వీరిని అదుపు చేసేందుకు రంగంలోకి దిగిన పోలీసులపైకి అల్లరిమూకలు రాళ్లు రువ్వాయి. వారిని నిలువరించేందుకు పోలీసులు గాల్లోకి కాల్పులు జరపడంతో పాటు బాష్పవాయు గోళాలను ప్రయోగించారు. పెద్ద సంఖ్యలో గుమిగూడిన అల్లరిమూకలు పోలీసులను ప్రతిఘటిస్తున్నాయి. ఇరువర్గాల మధ్య పరస్పర దాడులు జరుగుతున్నాయి. దీంతో అక్కడ యుద్ధ వాతావరణం నెలకొంది.