: మృత్యువుతో పోరాడి ఓడిన ఫార్ములా వన్ రేసర్


క్రీడాలోకం మరోసారి విషాదంలో మునిగిపోయింది. తలకు తీవ్ర గాయాలు కావడంతో కొన్నాళ్లుగా కోమాలో ఉన్న ఫార్ములా వన్ రేసర్ జూల్స్ బియాంచీ కన్నుమూశాడు. కిందటేడాది జపనీస్ గ్రాండ్ ప్రిక్స్ లో ఈ ఫ్రెంచ్ డ్రైవర్ ప్రమాదానికి గురయ్యాడు. రేసులో దూసుకెళుతుండగా జరిగిన ఈ ప్రమాదంలో బియాంచీ తలకు బలమైన దెబ్బలు తగిలాయి. అప్పటి నుంచి కోమాలోనే ఉన్నాడు. స్వస్థలం నైస్ లో ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ మేరకు బియాంచీ అఫిషియల్ ట్విట్టర్లో పోస్టు చేశారు. బియాంచీ మృతి పట్ల అతని టీమ్ 'మనోర్' సంతాపం తెలిపింది. అతడిని కోల్పోవడంతో ఎంతో కుంగిపోయామని ట్వీట్ చేసింది. అతడు తమ జట్టుకు ప్రాతినిధ్యం వహించడాన్ని గౌరవంగా భావిస్తున్నామని టీమ్ వర్గాలు పేర్కొన్నాయి.

  • Loading...

More Telugu News