: ప్రత్యూషకు కల్వకుంట్ల కవిత ఆత్మీయ పలకరింపు... మరికాసేపట్లో కేసీఆర్ పరామర్శ


కన్నతండ్రి, పినతల్లి చేతిలో నరకం చవిచూసిన బాలిక ప్రత్యూష దాదాపుగా సేఫ్ హ్యాండ్స్ లోకి చేరుకున్నట్లే. ప్రస్తుతం ఎల్బీ నగర్ లోని అవేర్ గ్లోబల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రత్యూషకు పరామర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాలిక విద్య, సంరక్షణ కోసం పలు సంస్థలతో పాటు ప్రముఖులు కూడా క్యూ కడుతున్నారు. సాక్షాత్తు తెలంగాణ సీఎం కేసీఆర్ బాలిక సంరక్షణ బాధ్యత తనదేనంటూ ప్రకటించారు. ఇదిలా ఉంటే, కేసీఆర్ కూతురు, నిజామాబాదు ఎంపీ కల్వకుంట్ల కవిత నిన్న ప్రత్యూషను పరామర్శించారు. అవేర్ గ్లోబల్ ఆస్పత్రికి వెళ్లిన కవిత, నేరుగా ప్రత్యూష చికిత్స తీసుకుంటున్న గదిలోకి వెళ్లారు. ఆరోగ్యమెలా ఉందంటూ ఆ బాలికను ఆత్మీయంగా పలకరించారు. ఇక ఎలాంటి భయం అవసరం లేదని భరోసా ఇచ్చారు. కవిత పరామర్శతో బాలికకు కొండంత ధైర్యం వచ్చినట్లైంది. కవిత పలకరింపు ప్రత్యూష లో గుండె ధైర్యాన్ని నింపింది. ఇక సీఎం కేసీఆర్ మరికాసేపట్లో తన సతీమణితో కలిసి అవేర్ ఆస్పత్రికి వెళ్లనున్నారు.

  • Loading...

More Telugu News