: కబడ్డీ లీగ్ లో అమితాబ్ జాతీయ గీతాలాపన... అన్ని మ్యాచ్ ల్లోనూ అతడి గాత్రాన్నే వినిపిస్తారట!
బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ సింగర్ గానూ కొత్త అవతారమెత్తనున్నాడు. నేడు ముంబైలో ప్రారంభం కానున్న ప్రొ కబడ్డీ లీగ్ టోర్నీ ప్రారంభం సందర్భంగా ఆయన భారత జాతీయ గీతం ‘జనగణమన’ను ఆలపించనున్నాడు. అమితాబ్ జాతీయ గీతాలాపనను రికార్డు చేయనున్న ప్రొ కబడ్డీ నిర్వాహకులు దానిని అన్ని మ్యాచ్ లకు ముందు వినిపిస్తారట. ఇక ఇప్పటికే టీవీల్లో హల్ చల్ చేస్తున్న ప్రొ కబడ్డీ లీగ్ ప్రోమోల్లోనూ అమితాబ్ గాత్రమే వినిపిస్తోంది. తాజాగా జాతీయ గీతాన్ని ఆలపించే అవకాశం రావడం తనకు దక్కిన గౌరవంగా అమితాబ్ పేర్కొన్నాడు.