: సుప్రీం నిర్ణయాన్ని గౌరవిస్తా... ఆటగాళ్ల పరిస్థితే బాధ కలిగిస్తోంది: ద్రావిడ్
ఐపీఎల్ ఫిక్సింగ్ వ్యవహారంలో సుప్రీంకోర్టు నియమించిన కమిటీ నిర్ణయాలను గౌరవిస్తానని క్రికెట్ దిగ్గజం రాహుల్ ద్రావిడ్ తెలిపారు. అయితే, చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీలు రెండేళ్ల నిషేధానికి గురైన నేపథ్యంలో, ఆ జట్ల ఆటగాళ్ల పరిస్థితి బాధ కలిగిస్తోందని అన్నారు. "కొన్ని సందర్భాల్లో ఒకరిద్దరు చేసిన పనులు ఎందరిపైనో ప్రభావం చూపుతాయి. సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో టాప్ ఆటగాళ్లు, కోచ్ లు ఏదో ఒక జట్టులో చేరిపోతారు. కానీ, యువ ఆటగాళ్ల విషయానికొచ్చేసరికి అంత సులువుగా అవకాశాలు లభించవు. దీనిపై ఇంతకుమించి మాట్లాడలేం. 'సుప్రీం' ఎంతో సమాచారం సేకరించి నిర్ణయాలు వెలువరించి ఉంటుంది... తప్పక గౌరవించాల్సిందే. కమిటీ సభ్యులు ఆటగాళ్ల విషయమై లోతుగా ఆలోచించి ఉంటారు" అని తెలిపారు.