: ప్రత్యూషకు అండగా ప్రముఖ సంస్థ


సవతి తల్లి చిత్ర హింసలు, తండ్రి నిర్లక్ష్యం, బంధువుల నిరాదరణకు గురైన ప్రత్యూషను ఆదుకునేందుకు ప్రముఖ సంస్థ ముందుకు వచ్చింది. సామాజిక సేవలో ముందుండే దుర్గాబాయి దేశ్ ముఖ్ సంస్థ ప్రత్యూషకు అండగా నిలిచేందుకు ఆసక్తి చూపింది. అందరూ ఉన్నా నిరాదరణకు గురవ్వడం సరైన విషయం కాదని న్యాయస్థానం ఆవేదన వ్యక్తం చేసిన నేపథ్యంలో దుర్గాబాయి దేశ్ ముఖ్ సంస్థ స్పందించింది. ఈ మేరకు న్యాయస్థానంలో రేపు అఫిడవిట్ వేయనున్నట్టు తెలుస్తోంది. విద్యాసంస్థలు, సేవా కార్యక్రమాలు నిర్వహించే దుర్గాబాయి దేశ్ ముఖ్ సంస్థకు విశేషమైన పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. అంతకు ముందు ఆమెను ఆదరించేందుకు ఎవరూ రాని పక్షంలో ప్రత్యూష సంరక్షణ బాధ్యతలు చూస్తానని సినీ నటుడు పోసాని కృష్ణ మురళి భరోసా ఇచ్చిన సంగతి తెలిసిందే. 'పోసాని గారూ... ఇక మీ సహాయం చాలు బాబోయ్' అనేంత వరకు ఆమెకు అండగా నిలుస్తానని చెప్పాడు. ఆయన స్పందించే సమయంలోనే ప్రత్యూష విద్యకు సంబంధించిన బాధ్యతను ఎన్టీఆర్ ట్రస్టు స్వీకరిస్తుందని టీడీపీ కార్యకర్తల నిధి సమన్వయకర్త నారా లోకేష్ పేర్కొన్న సంగతి తెలిసిందే. కాగా, నర్సింగ్ విద్యనభ్యసించిన తాను, బీఎస్సీ నర్సింగ్ చేయాలనుకుంటున్నానన్న ఆకాంక్షను ప్రత్యూష వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News