: లేటు వయసులో ఫేస్ బుక్ ఫ్రెండు చేయందుకున్న తల్లి పాత్రల నటి... ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన వివాహం


దిల్ చాహతా హై, లగాన్, జోధా అక్బర్, పేజ్ 3, హమ్రాజ్ వంటి చిత్రాల్లో కనిపించిన క్యారెక్టర్ నటి సుహాసిని ములాయ్ (64) జీవనప్రస్థానం ఆసక్తికరం. ఈ తల్లి పాత్రల నటి 90వ దశకంలో ఓ వ్యక్తితో సహజీవనం చేయగా, కొన్నాళ్లకు ఆ వ్యక్తి దూరమయ్యాడు. దీంతో ఆమె ఒంటరిగా మిగిలిపోయింది. అయితే, ఫేస్ బుక్ లో అతుల్ గుర్తూ అనే వ్యక్తి పరిచయం కావడంతో, మోడువారిని ఆమె జీవితంలో మళ్లీ వసంతం వచ్చినట్టయింది. వారిద్దరి మధ్య చాటింగులు, సందేశాలు కొనసాగాయి. ఒకరి అభిరుచులు మరొకరు తెలుసుకున్నాక తాము ఎందుకు పెళ్లి చేసుకోకూడదు అనుకున్నారు. అనుకున్నదే తడవుగా 2011 జనవరి 16న ఒక్కటయ్యారు. అయితే, ఇన్నాళ్లు రహస్యంగా ఉన్న ఆ విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం వీరిరువురు ముంబయిలోనే కాపురం చేస్తున్నారట. అతుల్ అంతకుముందే వివాహితుడు. క్యాన్సర్ కారణంగా భార్య గతించింది. ఇక, తాను పెళ్లి చేసుకుంటానని కుటుంబ సభ్యులు ఊహించలేదని, పెళ్లి విషయం తెలిసిన ప్రతి ఒక్కరూ షాక్ కు గురయ్యారని సుహాసిని ఓ వెబ్ పోర్టల్ కు తెలిపింది.

  • Loading...

More Telugu News