: పవన్ కు రూల్సు తెలియవన్నారు... మరి అన్నీ తెలిసిన మీరేం చేశారు?: 'సీపీఐ' రామకృష్ణ మండిపాటు


సీపీఐ ఏపీ కార్యదర్శి కె.రామకృష్ణ రాష్ట్రానికి చెందిన ఎంపీలపై మరోసారి మండిపడ్డారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు పార్లమెంటు రూల్సు తెలియవని విమర్శించిన ఏపీ ఎంపీలు, అన్నీ తెలిసిన తామేం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎంపీలు ప్రజా ప్రయోజనాలను విస్మరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం వ్యాపారాలు చేసుకునేందుకు ప్రాధాన్యతనిస్తున్నారు, ఎప్పుడైనా రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం గళమెత్తారా? అని దుయ్యబట్టారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో అయినా ప్రత్యేక హోదా కోసం పోరాడాలని సూచించారు. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా తాము ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

  • Loading...

More Telugu News