: 300 కోట్ల మంది డౌన్ లోడ్ చేసుకున్న 'యాంగ్రీ బర్డ్స్' రెండో వర్షన్ రెడీ


తొలి తరం టచ్ స్క్రీన్ ఫోన్లకు సుపరిచితమైన యాంగ్రీ బర్డ్స్ గేమును ఆడని మొబైల్ యూజర్లు ఉండరంటే అతిశయోక్తి కాదు. కోట్లాది మందిని సంవత్సరాల తరబడి అలరించిన ఈ గేమ్ రెండో వర్షన్ ఈ నెల 30న మార్కెట్లోకి విడుదల కానుంది. ఈ విషయాన్ని ఎంటర్ టెయిన్ మెంట్ మీడియా సంస్థ రోవియో ప్రకటించింది. దీన్ని ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్, యూట్యూబ్ తదితర మాధ్యమాల ద్వారా డౌన్ లోడ్ చేసుకునే సదుపాయం కల్పిస్తామని సంస్థ వివరించింది. యాంగ్రీ బర్డ్స్ తొలి వర్షన్ ను దాదాపు 300 కోట్ల మంది డౌన్ లోడ్ చేసుకున్నారని తెలిపింది.

  • Loading...

More Telugu News