: పెదనాన్న డిప్యూటీ కలెక్టర్, మేనమామ లాయర్... ప్రత్యూషను అక్కున చేర్చుకునే వారేరీ?


సవతి తల్లి చేతిలో చిత్రహింసలపాలైన అభాగ్యురాలు ప్రత్యూష పయనమెటు? కోర్టును కూడా వేధిస్తున్న ప్రశ్న ఇది! కన్నతండ్రి బతికే ఉన్నాడు, పెదనాన్న డిప్యూటీ కలెక్టర్, మేనమామ లాయర్... ఇలా అందరూ ఉన్నా ఆ బాలిక అనాథలా మిగిలిపోయింది. సవతి తల్లి చాముండేశ్వరి పైశాచికత్వానికి తనువెల్లా గాయాలు కాగా, ప్రస్తుతం ఆసుపత్రిలో కోలుకుంటున్న ప్రత్యూష తాను బంధువుల ఇళ్లకు వెళ్లబోనని తెగేసి చెప్పడం కోర్టును విస్మయానికి గురిచేసింది. దాంతో, ఆమె ఇష్టం వచ్చిన చోట ఉండేందుకు ఏర్పాట్లు చేస్తామని పేర్కొంది. తండ్రి వేతనంలో సగం ప్రత్యూషకు ఇవ్వాలని ఆదేశించింది. కాగా, అంతమంది బంధువులున్నా, వారిలో కొందరు ఉన్నతస్థాయిలో ఉన్నా ఆమె సంరక్షణకు ఎవరూ ముందుకు రాకపోవడం దారుణాతిదారుణం! చివరకు, ఓ నిరుపేద బాలికలా 'బేటీ బచావో బేటీ పఢావో' ప్రభుత్వ పథకం ద్వారా జీవనం సాగించనుండడం అత్యంత దయనీయం! సరిగ్గా న్యాయస్థానం కూడా ఇవే అభిప్రాయాలు వ్యక్తం చేసింది. నరకం నుంచి బయటపడినా, ఆ అమ్మాయిని అక్కున చేర్చుకునే వారేరీ? అంటూ న్యాయమూర్తి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News