: ముస్లింలకు, క్రైస్తవులకు డబ్బులిస్తూ హిందువులను పట్టించుకోవడం లేదు: తొగాడియా
విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్ పీ) అధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియా శుక్రవారం ఖమ్మం జిల్లాలో పర్యటించారు. అశ్వారావుపేటలో మీడియాతో మాట్లాడిన ఆయన, దేశంలో హిందువులను విస్మరిస్తున్నారని విమర్శించారు. మక్కా వెళ్లేందుకు ముస్లింలకు, వాటికన్ సిటీ వెళ్లేందుకు క్రైస్తవులకు డబ్బులిస్తూ, హిందువులను మాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. దేశంలో హిందువుల అభ్యున్నతికి తాము కట్టుబడి ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. భారత్ ను హిందూ దేశంగా మలచడమే తమ లక్ష్యమని ఉద్ఘాటించారు. మత మార్పిళ్లను అడ్డుకోవడం, నిరుపేద హిందువులకు ఉచిత విద్య, వైద్యం, గోపూజలు... తదితర అంశాలు తమ అజెండాలో ఉన్నాయని తెలిపారు.