: అరెస్టయిన బ్రహ్మానందరెడ్డి ‘ఎర్ర’డాన్ గంగిరెడ్డి సోదరుడేనట!
కడప జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ) మాజీ చైర్మన్ బ్రహ్మానందరెడ్డి... ఎర్రచందనం అంతర్జాతీయ స్మగ్లర్ గా పేరుగాంచిన కొల్లం గంగిరెడ్డి సోదరుడేనట. సహకార బ్యాంకు నిధుల దుర్వినియోగం కేసులో నేటి ఉదయం పోలీసులు బ్రహ్మానందరెడ్డిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కొల్లం గంగిరెడ్డి శేషాచలం అడవుల్లోని ఎర్రచందనాన్ని గుట్టుచప్పుడు కాకుండా దేశ సరిహద్దులు దాటిస్తుంటే, ఆయన సోదరుడు బ్రహ్మానందరెడ్డి మాత్రం రైతులకు అందాల్సిన సహకార నిధులను నిబంధనలకు నీళ్లొదిలి జేబులో వేసుకున్నారు. ఈ కేసులో బ్రహ్మానందరెడ్డికి ప్రత్యక్ష ప్రమేయముందని తేలడంతో ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు.