: 'వ్యాపం' కేసుతో సంబంధమున్న బీజేపీ నేతపై సస్పెన్షన్
సంచలనం రేపిన 'వ్యాపం' కుంభకోణం కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న మధ్యప్రదేశ్ బీజేపీ నేత గులాబ్ సింగ్ కిరార్ పై పార్టీ సస్పెన్షన్ విధించింది. వ్యాపం కేసులో తాజాగా సీబీఐ దర్యాప్తు మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. దాంతో కేసుతో సంబంధముందంటూ బీజేపీ నేత గులాబ్ సింగ్ పై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అంతేగాకుండా గతంలో కూడా నిందితుడిగా ఆయన పేరును సిట్ నమోదు చేసింది. అప్పుడు చర్యలు తీసుకోకపోయినా సీబీఐ విచారణతో చర్యలు తీసుకుంది. వైద్య ప్రవేశ పరీక్షల్లో గులాబ్, ఆయన కుమారుడు శక్తి ప్రతాప్ సింగ్ లు అక్రమాలకు పాల్పడ్డట్లు ఆరోపణలు రావడంతో కేసులో నిందితులుగా ఉన్నారు.