: 'గూగుల్ సాధించిన అతిపెద్ద విజయమిదే'


చైనా మొబైల్ దిగ్గజం జియోమీ వైస్ ప్రెసిడెంట్ హుగో బర్రా, గూగుల్ సంస్థను పొగడ్తలతో ముంచెత్తారు. 'ఆండ్రాయిడ్' ఆపరేటింగ్ వ్యవస్థను రూపొందించి విడుదల చేయడం గూగుల్ సాధించిన అతిపెద్ద విజయమని ఆయన అభివర్ణించారు. గూగుల్ తీసుకున్న అత్యుత్తమ నిర్ణయం ఇదేనని, దీని ఫలాలు దశాబ్దాల పాటు అందుతూనే ఉంటాయని 'బ్లూమ్ బర్గ్'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బర్రా అభిప్రాయపడ్డారు. సుమారు మూడేళ్లకు ముందు వరకూ గూగుల్ మొబైల్ బిజినెస్ వ్యాపారానికి అధిపతిగా వ్యవహరించిన హుగో బర్రా, 2013లో సంస్థను వీడి జియోమీలో చేరిన సంగతి తెలిసిందే. ఇప్పట్లో సెల్ ఫోన్లు ఆండ్రాయిడ్ వ్యవస్థను దాటి ముందుకు వెళ్లే పరిస్థితి లేదని ఆయన వ్యాఖ్యానించారు. స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలకు ఆండ్రాయిడ్ ను గూగుల్ ఉచితంగా అందించినంత కాలం, మరో సంస్థ కొత్త ఆపరేటింగ్ వ్యవస్థ తయారీ జోలికి వెళ్లబోదని అంచనా వేశారు. పలురకాల సెర్చింజన్లు ఉన్నట్టుగా, పలు రకాల ఆపరేటింగ్ సిస్టమ్స్ కావాలని స్మార్ట్ ఫోన్ యూజర్లు సైతం కోరుకోవడం లేదని తెలిపారు.

  • Loading...

More Telugu News