: ఐపీఎల్ స్కాంలో 'సుప్రీం' కమిటీ నిర్ణయాలను తప్పక పాటించాలి: సోనోవాల్


ఐపీఎల్ ఫిక్సింగ్ స్కాంలో సుప్రీంకోర్టు నియమించిన కమిటీ తీర్పును స్వాగతిస్తున్నట్టు కేంద్ర క్రీడల, యువజన వ్యవహారాల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ పేర్కొన్నారు. అహ్మదాబాదులో మీడియాతో మాట్లాడుతూ... కమిటీ నిర్ణయాలను కచ్చితంగా పాటించాలని అన్నారు. క్రీడలు అవినీతికి, వివాదాలకు అతీతంగా ఉండాలని దేశంలోని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. "కోర్టు ఏదైతే నిర్ణయించిందో, ఏ ఆదేశం అయితే వెలువడిందో దాన్ని తప్పక పాటించాలి. క్రీడా కార్యకలాపాలు మరింత పారదర్శకంగా నిర్వహించాలని మేం కూడా కోరుకుంటున్నాం. క్రీడలు స్వచ్ఛంగా ఉండాలి" అని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News