: సముద్రంలో గస్తీ తిరుగుతున్న నౌకపై ఐఎస్ దాడి


ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) మిలిటెంట్ గ్రూపు తాజాగా సముద్రతలంపై టెర్రర్ దాడులకు తెరదీసింది. మధ్యధరా సముద్రంలో ఈజిప్టు నావికాదళానికి చెందిన నౌకపై రాకెట్లు ప్రయోగించింది. సినాయ్ తీరానికి సమీపంలో సముద్రంలో ఈజిప్టు గస్తీ నౌక పహరా కాస్తుండగా, తీరంలో కొందరు జిహాదీలు కనిపించారు. గస్తీ నౌకలోని సిబ్బంది జిహాదీలపై కాల్పులు జరపగా, ప్రతిగా జిహాదీలు రాకెట్లతో విరుచుకుపడ్డారు. ఓ రాకెట్ నౌకకు తాకింది. దాంతో, నౌక మంటల్లో చిక్కుకోగా, సిబ్బందికి కాలిన గాయాలయ్యాయి.

  • Loading...

More Telugu News