: డ్రగ్స్ తో పట్టుబడిన భారత బాక్సర్
భారత బాక్సర్ రాకేశ్ కుమార్ డ్రగ్స్ తో పట్టుబడడం క్రీడావర్గాలను దిగ్భ్రాంతికి గురిచేసింది. రాకేశ్ నుంచి రూ.3 కోట్ల విలువైన డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. పంజాబ్ లోని హోషియార్ పూర్ రాకేశ్ కుమార్ స్వస్థలం. లైట్ వెల్టర్ వెయిట్ విభాగంలో భారత్ కు ప్రాతినిధ్యం వహించే రాకేశ్ కు డ్రగ్స్ వ్యవహారంలో శిక్ష పడితే, అతని కెరీర్ ముగిసినట్టే. ఇటీవలే ఇండోనేషియాలోని పాలెంబాంగ్ లో జరిగిన 22వ ప్రెసిడెంట్స్ కప్ బాక్సింగ్ టోర్నీలో భారత్ చాంపియన్ గా నిలిచింది. ఆ టోర్నీలో 69 కిలోల విభాగంలో తలపడ్డ రాకేశ్ స్వర్ణంతో మెరిశాడు.