: వీడియోకాన్ ఆఫర్...మహిళలకు మాత్రమే
ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన డిజిటల్ ఇండియాను మరింత విస్తృతం చేసేందుకు వీడియో కాన్ సంస్థ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఈ ఆఫర్ ఉద్దేశం ప్రకారం డిజిటల్ ఇండియాలో మహిళలను భాగస్వాములను చేయడం. మహిళా సాధికారత కోసం ఈ పథకంలో భాగంగా ప్రతి నెలా 100 ఎంబీ మెమొరీ డేటాను ఉచితంగా పది నెలల పాటు మహిళలకు అందజేయనున్నామని వీడియో కాన్ తెలిపింది. అలాగే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన వెబ్ సైట్లు వీక్షించినందుకు ఎలాంటి ఛార్జీలు వసూలు చేయమని వీడియో కాన్ స్పష్టం చేసింది. ఈ ఆఫర్ ద్వారా మహిళా డేటా వినియోగదారుల సంఖ్య పెరుగుతుందని భావిస్తున్నట్టు వీడియో కాన్ పేర్కొంది.