: మీ రాతలు నకిలీలకు కారణమవుతున్నాయి: ఆర్బీఐ సూచన


కరెన్సీ నోట్లపై రాతలు రాయవద్దని దేశ ప్రజలకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పిలుపునిచ్చింది. కరెన్సీ నోట్లపై రాసే రాతలు నకిలీలను రూపుమాపేందుకు అడ్డంకిగా మారుతున్నాయని ఆర్బీఐ వెల్లడించింది. ఇలాంటి రాతల వల్ల కరెన్సీ నోట్లపై సెక్యూరిటీ చిహ్నంగా తాము ముద్రించిన ముద్ర కనిపించడం లేదని, దీని కారణంగా నకిలీలు, సిసలు నోట్ల మధ్య వ్యత్యాసం గుర్తించడం కష్టంగా మారుతుందని ఆర్బీఐ అభిప్రాయపడింది. ఇకపై కరెన్సీపై రాతలు రాయవద్దని, నకిలీ కరెన్సీని అరికట్టేందుకు అంతా సహకరించాలని ఆర్బీఐ సూచించింది. కాగా, కరెన్సీ లెక్కబెట్టేటప్పుడు నోట్లు గుర్తుంచుకునేందుకు వీలుగా వాటి సంఖ్యను వేయడం సర్వసాధారణంగా జరుగుతుంది. ఇలాంటి తప్పిదాలు చేయవద్దని ఆర్బీఐ ప్రకటనలో పేర్కొంది.

  • Loading...

More Telugu News