: కొడుకును కారులో గంటసేపు వదిలేశాడని అరెస్టు చేశారు
కుమారుడ్ని కారులో వదిలి ఇంటర్వ్యూకి హాజరైన వ్యక్తికి అరదండాలు పడ్డాయి. ఆస్ట్రేలియాలోని సిడ్నీలో బెల్లావిస్టాలో ఓ వ్యక్తి (35) ఇంటర్వ్యూకి వెళుతూ తన రెండేళ్ల కొడుకుని కూడా తీసుకెళ్లాడు. ఇంటర్వ్యూ హాల్ కు కుమారుడ్ని తీసుకెళ్లలేక కారులోనే సీట్లో కూర్చోబెట్టి, సీట్ బెల్టు పెట్టి వెళ్లాడు. గంట పాటు పార్కింగ్ ఉన్న కారులో బాబు ఉండిపోవడం చూసిన పలువురు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో బాబును బయటకు తీసిన పోలీసులు, తమ వెంట తీసుకెళ్లిపోయారు. ఇంటర్వ్యూ నుంచి బయటకు వచ్చిన తండ్రి విషయం తెలుసుకుని పోలీసులను ఆశ్రయించడంతో, గంట సేపు బాబుకు తిండితిప్పలు లేకుండా కారులోనే వదిలేసినందుకు అరెస్టు చేశారు.