: ఏపీ ఎక్స్ ప్రెస్ పేరు 'తెలంగాణ ఎక్స్ ప్రెస్'గా మార్పు


హైదరాబాద్-న్యూఢిల్లీ మధ్య ప్రయాణించే ఏపీ ఎక్స్ ప్రెస్ పేరు మారింది. కొత్తగా 'తెలంగాణ ఎక్స్ ప్రెస్'గా మార్చినట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. నవంబర్ 15 నుంచి మార్చిన పేరు అమల్లోకి రానుందని చెప్పింది. ఏపీ ఎక్స్ ప్రెస్ పేరు తెలంగాణ ఎక్స్ ప్రెస్ గా మార్చాలని తెలంగాణ ప్రభుత్వం పలుమార్లు విజ్ఞప్తి చేసింది. దీనిపై స్పందించిన రైల్వే శాఖ తాజాగా ఈ రైలుకు తెలంగాణ ఎక్స్ ప్రెస్ గా పేరు మారుస్తున్నట్టు స్పష్టం చేసింది.

  • Loading...

More Telugu News