: టాప్ టెన్ లో కోహ్లీ, ధావన్, ధోనీ


ఐసీసీ ప్రకటించిన వన్డే బ్యాట్స్ మన్ ర్యాంకింగ్స్ టాప్ టెన్ లో టీమిండియా ఆటగాళ్లు ముగ్గురు స్థానం సంపాదించుకోవడం విశేషం. ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ లో రాణించిన టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ నాలుగవ స్థానం సంపాదించుకోగా, టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ 7వ ర్యాంకు దక్కించుకున్నాడు. టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ 9వ ర్యాంకులో నిలిచాడు. దీంతో టాప్ టెన్ లో మూడు స్థానాలు సంపాదించుకుని టీమిండియా బ్యాట్స్ మెన్ సత్తా చాటగా, ఒక్క బౌలరూ టాప్ టెన్ లో చోటు దక్కించుకోలేకపోవడం విశేషం. భువనేశ్వర్ కుమార్ 12వ ర్యాంకులో నిలవగా, అక్షర పటేల్ 47వ ర్యాంకు, మోహిత్ శర్మ 51వ ర్యాంకు దక్కించుకున్నారు.

  • Loading...

More Telugu News