: న్యాయ వ్యవస్థను శంకించాల్సి వస్తోంది: కుంద్రా
ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసులో లోథా కమిటీ తనకు చాలా అన్యాయం చేసిందని రాజస్థాన్ ఫ్రాంచైజీ సహ యజమాని, నటి శిల్పా షెట్టి భర్త రాజ్ కుంద్రా వాపోయారు. విచారణలో తాను అందించిన తోడ్పాటే తన పాలిట శాపమైందని అన్నారు. తన నిజాయతీకి ఈరోజు సవాలు ఎదురైందని చెప్పారు. న్యాయ వ్యవస్థపై తనకు ఎంతో గౌరవం ఉందని... కానీ, ఇప్పుడు దాన్ని శంకించాల్సి వస్తోందని తెలిపారు. కేసు విచారణలో తనకు వ్యతిరేకంగా సేకరించిన సాక్ష్యాలనైనా ఇవ్వాలని... ఈ సమయంలో కనీసం వాటిని చూసైనా సంతృప్తి పడతానని చెప్పారు.