: దేశంలో హిందుత్వం ఉండరాదు: కంచె ఐలయ్య
ప్రముఖ విద్యావేత్తగా పేరుగాంచిన కంచె ఐలయ్య మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. వేదాలకు, బ్రాహ్మణులకు వ్యతిరేకంగా రచనలు రావాలని... దేశంలో అగ్రకుల ఆధిపత్యం నశించాలని అన్నారు. బ్రాహ్మణులకు వ్యతిరేకంగా పోరాడే తెలివితేటలు వెనుకబడిన వర్గాలకు లేవని అభిప్రాయపడ్డారు. అంబేద్కర్, పూలే కలలు నెరవేరాలంటే వేదాలకు వ్యతిరేకంగా రచనలు రావాలన్నారు. దేశంలో హిందుత్వం ఉండకూడదని సంచలన వ్యాఖ్యలు చేశారు. గోదావరి పుష్కరాలకు ఒక్కరు కూడా వెళ్లకుండా క్రైస్తవులు, దళితులు చూడాలని విన్నవించారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి భరత్ భూషణ్ రచించిన 'మెమొరీస్ ఆఫ్ దళిత్ సర్వెంట్' అనే పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో ఐలయ్య మాట్లాడుతూ, పైవ్యాఖ్యలు చేశారు.