: గోదావరి పుష్కరాల్లో బాంబు కలకలం!
యాత్రికులు భక్తి భావంతో పుష్కర స్నానాలు ఆచరిస్తున్న వేళ, బాంబు పెట్టారన్న ఫోన్ కాల్ పోలీసులను ఉరుకులు, పరుగులు పెట్టించింది. ఈ ఘటన నేటి మధ్యాహ్నం రాజమండ్రిలో జరిగింది. నగరంలోని వశిష్ట వీఐపీ ఘాట్ వద్ద గోదావరిలో ప్రయాణిస్తున్న బోటులో బాంబు పెట్టినట్టు గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఫోన్ వచ్చింది. దీంతో పోలీసులు హుటాహుటిన ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయించి బోటును తనిఖీ చేశారు. ఈ వార్త భక్తుల్లో సైతం ఆందోళనను పెంచింది. ఆపై చివరికి ఎటువంటి బాంబూ లేదని, ఎవరో ఆకతాయి ఫోన్ కాల్ చేశాడని తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నారు. ఎలాంటి పుకార్లనూ భక్తులు నమ్మవద్దని పోలీసులు సూచిస్తున్నారు.