: నకిలీ డిగ్రీ వివాదంలో ఇరుక్కున్న మాజీ క్రికెటర్ సతీమణి


పాకిస్థాన్ విపక్ష నేత, మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ సతీమణి రెహమ్ ఖాన్ నకిలీ డిగ్రీ వివాదంలో చిక్కుకున్నారు. ఆమె డిగ్రీ సర్టిఫికెట్ నకిలీదని బ్రిటన్ మీడియాలో కథనాలు వచ్చాయి. ఆమె ఇంగ్లాండ్ లోని నార్త్ లిండ్సే కాలేజీలో బ్రాడ్ కాస్ట్ జర్నలిజంలో డిగ్రీ చదివినట్టు చెప్పుకోగా, అసలు ఆ కాలేజీలో సదరు జర్నలిజం కోర్సే లేదని 'ఎక్స్ ప్రెస్ ట్రిబ్యూన్' పత్రిక పేర్కొంది. రెహమ్ ఖాన్ పేరుతో ఎవరూ కూడా కాలేజీలో విద్యాభ్యాసం చేయలేదని, తన క్వాలిఫికేషన్ విషయమై ఆమె అవాస్తవం చెప్పారని 'డైలీ మెయిల్' వెల్లడించింది. కాగా, ఈ పత్రికలను ఉటంకిస్తూ, పాక్ చానళ్లు పదేపదే కొనసాగింపు వార్తలను ప్రసారం చేశాయి. వీటిపై మండిపడ్డ రెహమ్ ఖాన్, ఈ వార్తలను ఖండించారు. ఇవి నిరాధారమైనవని కొట్టిపారేశారు.

  • Loading...

More Telugu News