: బాహుబలి లాభాల్లో ప్రభాస్ కు రూ. 65 కోట్లు: రామ్ గోపాల్ వర్మ
బాహుబలితో సూపర్ స్టార్ డమ్ ను పొందిన ప్రభాస్ ను దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆకాశానికెత్తేశారు. కేవలం ఒక్క సినిమా కోసం ఏకంగా రెండు సంవత్సరాలు షూటింగ్ లో పాల్గొన్న ప్రభాస్ ను చూసి, తప్పుచేశాడని అనుకుని మనమే ఫూల్స్ అయ్యామని ట్వీట్ చేశాడు. రెమ్యునరేషన్ కూడా తీసుకోకుండా మరింత తప్పు చేశాడని అనుకున్నామని చెప్పాడు. అయితే, కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న బాహుబలి పార్ట్-1 లాభాల్లోంచి ప్రభాస్ కు రూ. 65 కోట్ల షేర్ వచ్చిందని తెలిపాడు. ఒక్క సినిమా కోసం రూ. 65 కోట్లు తీసుకున్న హీరో భారతీయ సినీ చరిత్రలో మరెవరైనా ఉన్నారా? అని ప్రశ్నించాడు. కేవలం రెండేళ్ల కష్టానికే ప్రభాస్ కు అంతర్జాతీయ గుర్తింపు కూడా వచ్చిందని ట్విట్టర్లో తెలిపాడు.