: ధవళేశ్వరంలో పిండ ప్రదానం చేస్తూ వ్యక్తి మృతి!
తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలో విషాదం చోటుచేసుకుంది. ఇక్కడి గాయత్రి పుష్కరఘాట్ వద్ద విజయవాడకు చెందిన బ్యాంక్ రిటైర్డ్ మేనేజర్ మహంకాళి సుబ్బయ్య మృతి చెందారు. ఈ ఘాట్ లో పుష్కరస్నానం చేసిన అనంతరం పిండ ప్రదానం చేస్తున్న ఆయనకు అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయారు. వెంటనే కుటుంబ సభ్యులు 108కు సమాచారం ఇవ్వగా, వాహనం అక్కడికి వచ్చేలోగానే సుబ్బయ్య చనిపోయారు. కుటుంబసభ్యులు తీవ్రంగా రోదిస్తున్నారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.