: పగలని, తడవని స్మార్ట్ ఫోన్... 31 నుంచి బుకింగ్స్ మొదలు!


వేల రూపాయలు పెట్టి కొనుగోలు చేసే స్మార్ట్ ఫోన్ కిందపడినా, నీటిలో తడిసినా దానిపై ఆశలు వదులుకోవాల్సిందేనన్న సంగతి తెలిసిందే. అయితే, కిందపడినా పగలని, నీటిలో మునిగినా పాడుకాని, ఎవరూ హ్యాక్ చేయలేని సరికొత్త ఫోన్ త్వరలో మార్కెట్లోకి రానుంది. అమెరికాకు చెందిన టర్నింగ్ రోబోటిక్ ఇండస్ట్రీస్ అత్యంత పటిష్ఠమైన లిక్విడ్ మార్ఫియం లోహంతో దీన్ని తయారు చేస్తోంది. ఈ ఫోన్ స్క్రీన్ బ్రేకేజీని తట్టుకుంటుందని శాన్ ఫ్రాన్సిస్కో కేంద్రంగా నడుస్తున్న ఈ సంస్థ సీఈఓ స్టీవ్ చయో వివరించారు. ఈ నెల 31 నుంచి ఫోన్ అడ్వాన్సు బుకింగులు ప్రారంభించనున్నామని తెలిపారు. 16 జిబి అంతర్గత మెమొరీతో లభించే ఫోన్ ధర సుమారుగా రూ. 27 వేలని సమాచారం.

  • Loading...

More Telugu News