: మధ్యాహ్నం 3 గంటలకు పంజాగుట్టలో రామకృష్ణకు అంత్యక్రియలు
ప్రముఖ గాయకుడు రామకృష్ణ అంత్యక్రియలు ఈ మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాదులోని పంజాగుట్ట శ్మశానవాటికలో జరగనున్నాయి. ఈ తెల్లవారుజామున ఆయన తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఆయన భౌతికకాయాన్ని పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు చివరి సారిగా దర్శించుకుని, అంజలి ఘటించారు. రామకృష్ణ అంత్యక్రియలకు ఏర్పాట్లన్నీ పూర్తవుతున్నాయి.