: ప్రధాని మోదీ వారణాసి పర్యటన రద్దు


ప్రధానమంత్రి నరేంద్రమోదీ వారణాసి పర్యటన రద్దైంది. అక్కడ భారీ వర్షాలు కురుస్తున్న కారణంగా పర్యటనను రద్దు చేసుకున్నట్టు పీఎంఓ అధికారులు తెలిపారు. ఈ రోజు తన సొంత నియోజకవర్గమైన వారణాసిలో ప్రారంభించాల్సిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని మోదీ శంకుస్థాపన చేయాల్సి ఉంది. గత నెల 28న కూడా ప్రధాని వారణాసిలో పర్యటించాలని అనుకున్నప్పటికీ అప్పుడు కూడా భారీ వర్షం కురుస్తుండడంతో తన పర్యటనను రద్దు చేసుకున్నారు.

  • Loading...

More Telugu News