: సానియామీర్జాతో కలసి హల్ చల్ చేసిన కవిత... మార్టినాతో సెల్ఫీ
వింబుల్డన్ విజేత, తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ సానియామీర్జాతో కలసి టీఆర్ఎస్ ఎంపీ కవిత హల్ చల్ చేశారు. డబుల్స్ లో నెంబర్ వన్ ర్యాంక్ సాధించిన సానియాను నిన్న 'డబ్ల్యూటీఏ ఫ్యూచర్ స్టార్స్' సన్మానించింది. ఈ కార్యక్రమానికి కవితతో పాటు, టెన్నిస్ దిగ్గజం మార్టినా నవ్రతిలోవా హాజరయ్యారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ, మహిళల టెన్నిస్ ను తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రోత్సహిస్తోందని తెలిపారు. వింబుల్డన్ ను సానియా గెలవడం తెలంగాణకే కాకుండా, దేశానికి కూడా గర్వకారణమని చెప్పారు. ఈ సందర్భంగా సానియాను కవిత, నవ్రతిలోవాలు సన్మానించారు. అనంతరం సానియా మాట్లాడుతూ, నెంబర్ వన్ ర్యాంక్ సాధించడానికి ఎంతో కష్టపడ్డానని తెలిపింది. తాను సాధించిన ఈ ఘనత ద్వారా ఏదైనా సాధించవచ్చని భారత అమ్మాయిలు నమ్ముతారని భావిస్తున్నట్టు చెప్పింది.